Ad Code

రానున్న 10 రోజుల్లో భారీ వర్షాలు !


ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి సరైన వర్షాలు కురవలేదు. దీంతో భారీ వర్షాల కోసం రైతన్నలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది జూన్ మొదటివారంలో నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకుతాయి. జులై 13వ తేదీ వచ్చినా కానీ ఇప్పటి వరకు ఆశించినంత వర్షాలు కురవలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న 10 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు కూడా మధ్యాహ్నం, సాయంత్రం వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక జులై 15 నుంచి 22 వరకు బంగాళాఖాతంలో వరుసగా రెండు అల్పపీడనాలు చోటుచేసుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. తద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో రానున్న 10 రోజుల్లో తెలంగాణ, ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంటోంది.రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, మహారాష్ట్ర , గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

Post a Comment

0 Comments

Close Menu