Ad Code

ఇల్లు, స్థలాలు అమ్మితే లాభాలపై 12.5% పన్ను


ర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్థిరాస్తి అమ్మకందారులకు ఊహించని షాక్ ఇచ్చారు. ప్రాపర్టీ సేల్పై ఇన్నాళ్లూ ఉన్న ఇండెక్సేషన్ బెన్ఫిట్స్ను రద్దు చేసినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. రెండు సంవత్సరాలు దాటిన స్థిరాస్తి ఇప్పుడు అమ్మితే లాభాల్లో 12.5 శాతం పన్ను కట్టాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఢమాల్ అన్నాయి. డీఎల్ఎఫ్ స్టాక్ 6 శాతం పడిపోయింది. గోద్రేజ్ ప్రాపర్టీస్ స్టాక్ 5 శాతం, ప్రెస్టేజ్ ఎస్టేట్ 5.3 శాతం, ఫీనిక్స్ మిల్స్ షేర్ 2.1 శాతం క్షీణించడం గమనార్హం. స్థిరాస్తి అమ్మకాలపై ఈ ప్రకటన రాక ముందు లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్పై ఇండెక్సేషన్ బెన్ఫిట్స్తో కూడిన 10 శాతం పన్ను ఉండేది. ఇప్పుడు ఇండెక్సేషన్ బెన్ఫిట్స్ను తొలగించి స్థిరాస్తి అమ్మగా వచ్చిన లాభాలపై 12.5 శాతం పన్ను కట్టాలని కేంద్ర ప్రభుత్వం దిమ్మతిరేగే షాక్ ఇచ్చింది. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించాలని ఆలోచన చేసే వారికి ఇది పెద్ద పిడుగు లాంటి వార్తేనని చెప్పక తప్పదు. 

Post a Comment

0 Comments

Close Menu