Ad Code

12 వరకు కేజ్రీవాల్‌ కస్టడీ పొడిగింపు !


ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు ఈ నెల 12 వరకు పొడిగించింది. కేజ్రీవాల్‌ను ఈడీ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టులో హాజరుపరిచింది. ఇంతకుముందు ఈడీ జూన్‌ 29న సీబీఐ కోర్టు రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం ప్రత్యేక సీబీఐ కోర్టు 14 రోజుల జ్యూడీషియల్‌ కస్టడీకి ఇచ్చింది. మద్యం పాలసీ కేసులో గత నెల 26న సీబీఐ అరెస్టు చేసిన విషయం విధితమే. ఆ తర్వాత మూడురోజులు సీబీఐ కస్టడీకి తీసుకోగా రిమాండ్‌ గడువు ముగియగా 29న కోర్టులో హాజరుపరిచింది. దీంతో కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆప్ కన్వీనర్‌కు జూన్ 20న ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, ట్రయల్ కోర్టు ఆదేశాలపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఆ తర్వాత స్టేపై సవాల్‌ చేయగా.. హైకోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. ఇదిలా ఉండగా.. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన తిహార్‌ జైలులో ఉంటున్నారు.

Post a Comment

0 Comments

Close Menu