Ad Code

జూలై 15 వరకు ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయమంటున్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని పలు కార్యాలయాలు !

నంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం జూలై 12 న బీకేసీలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ నేపథ్యంలో ముంబైలోని ప్రతిష్ఠాత్మక వాణిజ్య కేంద్రం బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని పలు కార్యాలయాలు జూలై 15 వరకు రిమోట్ గా పని చేయాలని ఉద్యోగులకు సూచించాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు, సెక్యూరిటీ ఆంక్షలు ఉంటాయని, అందువల్ల వర్క్ ఫ్రం హోం చేయాలని ఉద్యోగులకు సూచించాయి. ముంబైలోని రద్దీగా ఉండే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఉన్న వివాహ వేదిక చుట్టూ జూలై 12 నుంచి 15 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ప్రాంతంలోనే బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్, సెబీ, అనేక అంతర్జాతీయ బ్యాంకులు ఉన్నాయి. అంబానీ-మర్చంట్ వివాహం కారణంగా ముంబై అంతటా హోటల్ బుకింగ్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దాంతో, పలు లగ్జరీ హోటళ్లు ఒక్కో రాత్రికి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. ట్రైడెంట్, ఒబెరాయ్ వంటి వేదికలు జూలై 10 నుంచి 14 వరకు పూర్తిగా బుక్ అయ్యాయి. ఈ వివాహానికి బాలీవుడ్, హాలీవుడ్, వ్యాపార, క్రీడా వర్గాల నుంచి అతిథులు హాజరవుతున్నారు. హెచ్ ఎస్ బీ సీ హోల్డింగ్స్ చైర్మన్ మార్క్ టక్కర్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ జే లీ, యూకే మాజీ నేతలు బోరిస్ జాన్సన్, టోనీ బ్లెయిర్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని బ్లూమ్ బర్గ్ తెలిపింది. అతిథుల జాబితాలో సౌదీ ఆరామ్కోకు చెందిన అమీన్ నాసర్, బీపీ పీఎల్సీకి చెందిన ముర్రే ఆచింక్లోస్, జీఎస్కే పీఎల్సీకి చెందిన ఎమ్మా వాల్మ్స్లీ, లాక్హీడ్ మార్టిన్కు చెందిన జిమ్ టైక్లెట్, ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో ఉన్నారు.

Post a Comment

0 Comments

Close Menu