Ad Code

ఆగస్టు 1న తెలంగాణ మంత్రివర్గ సమావేశం ?


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 1 సాయంత్రం 4 గంటలకు మంత్రి మండలి సమావేశం జరుగనుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 2తో ముగియనున్నాయి. అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టగా, బడ్జెట్ పై చర్చ జరుగుతోంది. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు ఈ నెల 31న అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ సమావేశాల ముగింపునకు ఒక్క రోజు ముందే తెలంగాణ కేబినెట్ భేటీ కానుండటం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ భేటీ కి సంబంధించిన అజెండా ఏంటి అనేది తెలియనప్పటికీ.. జాబ్ క్యాలెండర్, రైతు భరోసా గైడ్ లైన్స్ కి సంబంధించిన టాపిక్స్ పై కేబినెట్ లో చర్చించనున్నట్టు సమాచారం.

Post a Comment

0 Comments

Close Menu