Ad Code

2033 నాటికి రష్యాకు సొంత స్పేస్‌ స్టేషన్‌ ?


2033 నాటికి సొంత స్పేస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా రష్యా స్టేట్ స్పేస్ కార్పొరేషన్ రోస్కోస్మోస్ ప్రకటించింది. రష్యన్ ఆర్బిటల్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను రోస్కోస్మోస్ అధిపతి యూరీ బొరిసోవ్ మంగళవారం వెల్లడించారు. ఈ ఆర్బిటల్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టాలని 2021లో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రణాళిక ప్రకారం 2027లోగా స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని, 2030 నాటికి యూనివర్సల్ నోడల్, కక్ష్య స్టేషన్‌లోని ప్రధాన భాగాన్ని పూర్తి చేస్తామన్నారు. 2031 నుంచి 2033 వరకు రెండు ప్రత్యేక ప్రయోజన మాడ్యూల్స్ (TsM1, TsM2) ను స్టేషన్‌కు అనుసంధానం(డాక్) చేస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం సుమారు $6.98 బిలియన్ల వ్యయం ఉంటుందని యూరీ బొరిసోవ్ పేర్కొన్నారు. 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసిన రష్యాను ఒంటరిని చేసేందుకు పాశ్చాత్య దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. ఆ ఆంక్షలను వెనక్కి తీసుకోకపోతే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చేస్తామని అప్పట్లో రష్యా హెచ్చరించింది. అయినప్పటికీ అమెరికా స్పందించకపోవడంతో బయటకు వచ్చేందుకు సిద్ధమైంది.

Post a Comment

0 Comments

Close Menu