Ad Code

రూ.3కి పడిపోయిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్ ధర !


కప్పటి బిలియనీర్ అనిల్ అంబానీకి చెందిన చాలా కంపెనీలు దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో సదరు కంపెనీల షేర్ ధరలు చాలా కాలంగా నష్టపోయాయి. అలా ఇన్వెస్టర్లను నిండా ముంచిన కంపెనీల్లో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఒకటిగా ఉంది. అయితే రెండు రూపాయల కంటే తక్కువకు పడిపోయిన కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు నేడు మార్కెట్లో ఇన్వెస్టర్ల నుంచి హడావిడి నెలకొంది. దీంతో నేడు షేర్ ధర పెరిగి రూ.3.64కి చేరింది. దీనికి ముందు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ షేర్ల ధర రూ.6.22 స్థాయికి చేరుకుంది. అయితే హోమ్ ఫైనాన్స్ స్టాక్ ధర 2017లో రూ.120 కంటే ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. కంపెనీలో ప్రమోటర్ అనిల్ అంబానీకి సైతం 0.74 శాతం వాటాలు ఉన్నాయి. అలాగే కంపెనీలో పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఏకంగా 99.26 శాతంగా ఉంది. ఇక్కడ పబ్లిక్ షేర్‌హోల్డర్‌లలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఉంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌లో ఎల్‌ఐసీకి 74,86,599 షేర్లు ఉన్నాయి. ఇటీవల నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌లో ప్రొఫెషనల్ అండ్ ఆడిట్ సంబంధిత అవకతవకలకు సంబంధించి ఒక ఆడిట్ కంపెనీ, ఇద్దరు ఆడిటర్‌లపై మొత్తం రూ.1.6 కోట్ల జరిమానా విధించింది. 

Post a Comment

0 Comments

Close Menu