Ad Code

దేశీయ మార్కెట్లో 30న రియల్‌మీ 13 ప్రో సిరీస్ ఫోన్ల ఆవిష్కరణ !


రియల్‌మీ 13 ప్రో సిరీస్ 5జీ ఫోన్లను ఈ నెల 30న భారత్ మార్కెట్‌లో రియల్‌మీ ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్లు బోస్టన్ మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సహకారంతో రూపుదిద్దుకున్నాయి. ఈ ఫోన్ 6.7 అంగుళాల (1080×2412 పిక్సల్స్) అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుందని భావిస్తున్నారు. 2.4 గిగా హెర్ట్జ్ ఒక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుందని తెలుస్తోంది. 16 జీబీ ర్యామ్ తోపాటు ఒక టిగా బైట్ వరకు ఇన్ బిల్ట్ స్టోరేజీ కెపాసిటీ ఉంటుందని చెబుతున్నారు. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తుందని తెలుస్తున్నది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. రియల్ మీ 13 ప్రో + ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. అందులో 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 701 సెన్సర్ విత్ ఓఐఎస్, 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 600 సెన్సర్ విత్ 3ఎక్స్ జూమ్ కెమెరాలతో వస్తోంది. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‫తో వస్తున్న రియల్ మీ 13 ప్రో 5జీ ఫోన్ 5050 ఎంఎహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇంతకుముందు వచ్చిన సమాచారం మేరకు ఈ ఫోన్ అడ్రెనో 710 జీపీయూ ప్రాసెసర్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. రియల్ మీ నుంచి వస్తున్న తొలి ప్రొఫెషనల్ ఏఐ కెమెరా ఫోన్ ఇది. హైపర్ ఇమేజ్+ ఫోటోగ్రఫీ ఆర్కిటెక్చర్ కలిగి ఉంటాయి. రియల్ మీ 13 ప్రో+, రియల్ మీ 13 ప్రో ఫోన్లు మోనెట్ గోల్డ్, మోనెట్ పర్పుల్ కలర్ ఆప్షన్లతో వస్తున్నాయి. ఏఐ ఫోటో ఎన్ హాన్స్ మెంట్, ఏఐ స్మార్ట్ రిమూవల్, ఏఐ ఆల్ట్రా క్లారిటీ వంటి పలు ఏఐ ఫీచర్లతో ఈ రెండు ఫోన్లు వస్తున్నాయి

Post a Comment

0 Comments

Close Menu