Ad Code

3D టెక్నాలజీతో ఏసర్‌ ల్యాప్‌టాప్‌ విడుదల


దేశీయ మార్కెట్‌లో  ఏసర్‌ తాజాగా Acer Aspire 3D 15 Spatiallabs ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్‌ 3D టెక్నాలజీ ని కలిగి ఉంటుంది. గ్లాస్‌ల అవసరం లేకుండానే 3D లో చూసేందుకు వీలుంటుంది. దీంతోపాటు 4K రిజల్యూషన్‌లో 2D లోనూ చూసేందుకు వీలుంది. ఈ ఏసర్‌ కొత్త ల్యాప్‌టాప్‌ intel core i7 ప్రాసెసర్‌ మరియు Nvidia Geforce RTX 4050 GPU తో పనిచేస్తుంది. 1920*2160 పిక్సల్‌ రిజల్యూషన్‌ తో 15.6 అంగుళాల 4K డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ల్యాప్‌ టాప్‌ SpatialLabs టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ టెక్నాలజీ కారణంగా 2D నుంచి సులభంగా 3D లోకి మారేందుకు అవకాశం ఉంది. 2D లో 380 నిట్స్‌ గరిష్ట డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. అదే 3D లో అడాబ్‌ RGB కలర్ గామట్‌ 100 శాతం కవరేజీతో వస్తుంది. దీంతోపాటు ఈ ఏసర్‌ ల్యాప్‌టాప్‌ వినియోగదారుడి కంటి కదళికల ఆధారంగా పనిచేసేలా ఆప్టికల్‌ లెన్స్‌ను కలిగి ఉంది. మరియు ఈ ల్యాప్‌టాప్‌ 13 వ జనరేషన్‌ Intel Core i7 ప్రాసెసర్‌ సహా Nvidia Geforce RTX 4050 GPU తో పనిచేస్తుంది. 32GB DDRS ర్యామ్‌ మరియు 2TB M.2 PCle SSD స్టోరేజీని కలిగి ఉంది. 720 పిక్సల్‌ రిజల్యూషన్‌తో HD కెమెరాను కలిగి ఉంటుంది. 30fps తో వీడియో రికార్డు చేయవచ్చు. మరియు ఏసర్‌ టెంపరాల్‌ నాయిస్‌ రిడక్షన్‌ టెక్నాలజీ తో అందుబాటులోకి వస్తుంది. అంటే వీడియో రికార్డింగ్ సమయంలో అవసరం లేని సౌండ్ రికార్డు కాకుండా చూస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ ప్యూరిఫైడ్‌వ్యూ, ప్యూరిఫైడ్‌ వాయిస్‌ మరియు తక్కువ కాంతిలోనూ మెరుగైన ఫోటోలు తీసేందుకు వీలుగా ఏసర్ టీఎన్‌ఆర్‌ టెక్నాలజీని కలిగి ఉంటుంది. వీటితోపాటు DTS అల్ట్రాసౌండ్‌ మరియు ఏసర్‌సెన్స్ యాప్‌ను కలిగి ఉంటుంది. HDMI 2.1 పోర్ట్‌, USB-C, వైఫై 6 వంటి ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. దీంతోపాటు స్టీరియో స్పీకర్లను కలిగి ఉన్నాయి. ల్యాప్‌టాప్‌ను వినియోగిస్తున్న సమయంలో చల్లగా ఉంచేందుకు మూడు కాపర్‌ హీట్ పైప్‌, రెండు ఫ్యాన్‌లతో కూడిన ట్విన్‌ఎయిర్‌ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

Post a Comment

0 Comments

Close Menu