Ad Code

త్వరలో వివో వి 40, బి 40 ప్రో స్మార్ట్ ఫోన్ల విడుదల ?


వివో వి 40 సిరీస్ స్మార్ట్ ఫోన్ సిరీస్ నుంచి వివో వి 40, వి 40 ప్రో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లను నాలుగు 50MP పవర్ ఫుల్ కెమెరాలతో తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను త్వరలోనే ఇండియాలో విడుదల చేస్తుందని మాత్రం తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ను సేల్ పార్ట్ నర్ గా ఎంచుకుంది. వివో వి 40 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను పూర్తిగా Zeiss కెమెరాలతో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ లో పవర్ ఫుల్ కెమెరా సెటప్ ఉన్నట్లు కంపెనీ టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP Zeiss అల్ట్రా వైడ్ కెమెరా, OIS సపోర్ట్ కలిగిన 50MP (Sony IMX 921) మెయిన్ కెమెరా మరియు 50MP (Sony IMX 816) టెలిఫోటో కెమెరా ఉన్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ ముందు భాగంలో 50MP వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. ఈ నాలుగు కెమెరాలు కూడా Zeiss ఆప్టిక్స్ మరియు ఫిల్టర్స్ సపోర్ట్ ను కలిగి ఉంటాయి. ఈ ఫోన్ 2X ఆప్టికల్ మరియు 50X Zeiss హైపర్ జూమ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ తో అద్భుతమైన పోర్ట్రైట్ మరియు నైట్ ఫోటో లతో పాటు గొప్ప వీడియోలు పొందవచ్చని వివో తెలిపింది. ఈ ఫోన్ వెనుక ఆకర్షణీయమైన కెమెరా డిజైన్ మరియు Aura లైట్ కూడా వుంది. ఈ అప్ కమింగ్ ఫోన్ IP68 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. 5500 mAh బిగ్ బ్యాటరీ మరియు 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ను లోటస్ పర్పల్, గాంజెస్ బ్లూ మరియు టైటానియం గ్రే మూడు ప్రీమియం కలర్ లలో అందిస్తుందని కూడా వివో టీజ్ చేస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu