Ad Code

సోనీ బ్రావియా 7 మినీ ఎల్ఈడీ సిరీస్ నుంచి కొత్త స్మార్ట్ టీవీలు !


దేశంలో సోనీ బ్రావియా 7 మినీ ఎల్ఈడీ సిరీస్ నుంచి కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి మూడు సైజుల్లో కొత్త స్మార్ట్ టీవీలు లాంచ్ చేసింది. ఈ కొత్త క్యూలెడ్ స్మార్ట్ టీవీ లను పవర్ ఫుల్ సౌండ్ అందించే స్పీకర్లు మరియు ఆల్ ఫార్మాట్ కంపేటబుల్ స్టన్నింగ్ స్క్రీన్ తో తీసుకు వచ్చింది.  ఈ కొత్త సోనీ స్మార్ట్ టీవీలు 55 ఇంచ్, 65 ఇంచ్ మరియు 75 ఇంచ్ స్క్రీన్ సైజులో విడుదల చేసింది. అయితే, ఈ మూడు స్మార్ట్ టీవీ లు కూడా ఒకే ఫీచర్లను కలిగి ఉంటాయి. ఈ టీవీ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు లోకల్ డిమ్మింగ్ క్యూలెడ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HDR 10, HLG మరియు Dolby Vision సపోర్ట్ తో వస్తుంది మరియు అద్భుతమైన విజువల్స్ ను అందిస్తుందని సోనీ తెలిపింది. XR మోషన్ క్లారిటీ, XR క్లియర్ ఇమేజ్ మరియు XR పిక్చర్ ప్రోసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ రెండు బాస్ రిఫ్లెక్స్ ఫుల్ రేంజ్ స్పీకర్లు, రెండు ట్వీటర్ లు కలిగిన ఫుల్ సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ కు తోడు ఇందులో Dolby Atmos, DTS:X, DTS-HD వంటి చాలా సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ లను కలిగి వుంది. ఈ టీవీ BRAVIA Cam మరియు కెమెరా యాప్ సపోర్ట్ ను కూడా కలిగి వుంది. ఈ స్మార్ట్ టీవీ బ్లూటూత్ 5.3 సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDPC, HDMI eArc/Arc మరియు USB పోర్ట్ లతో పాటుగా రెగ్యులర్ పోర్ట్ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది.



Post a Comment

0 Comments

Close Menu