Ad Code

చికిత్స పేరిట యువతి తలలోకి 70 సూదులు దింపిన మాంత్రికుడు ?


డిశా లోని బలంగీర్ జిల్లాలో అనారోగ్యంతో ఉన్న యువతి తలలో చికిత్స పేరిట 70 సూదులు దింపిన మాంత్రికుడి ఉదంతం ప్రస్తుతం ఒడిశాలో కలకలం రేపుతోంది. సూదులు పుర్రెను దాటి మెదడు దాకా వెళ్లకపోవడంతో యువతికి ప్రాణాపాయం తప్పింది. లంగీర్ జిల్లాలోని సింధేకెలా పోలీస్​ తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక సింథికేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇచ్గావ్ గ్రామానికి చెందిన రేష్మా బెహారా (19) మూడేళ్ల క్రితం అనారోగ్యం బారిన పడింది. రేష్మా కొన్నేళ్ల క్రితం విచిత్రంగా ప్రవర్తించింది. తన చేతిని పలుమార్లు కోసుకుంది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు స్థానిక వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. అయితే వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు, ఆమె ఆరోగ్యంగానే ఉందని ధ్రువీకరించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్లీ అలానే ప్రవర్తించింది. అప్పుడు యువతికి దెయ్యం పట్టిందని భావించి తేజ్రాజ్ అనే మాంత్రికుడి వద్దకు తండ్రి తీసుకెళ్లాడు.ఆ మాంత్రికుడి చికిత్స పేరుతో యువతి తలలోకి ఓ సూది చొప్పించాడు. అలా కొన్ని నెలలుగా సూదులను చొప్పిస్తూనే ఉన్నాడు. ఈ విషయం యువతి కుటుంబసభ్యులకు తెలియకుండా జరిగింది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి ఇటీవల విషమంగా మారింది. దీంతో కుటుంబసభ్యులు గురువారం రాత్రి బలంగిలో భీమ్వోయి మెడికల్ కాలేజీలో చేర్పించారు. అక్కడ సీటీ స్కాన్ లో యువతి తలలో అనేక సూదులు ఉన్నట్లు తేలింది. అనంతరం బర్ల భీంసార్ లో ఉన్న వింసార్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 10 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం శస్త్ర చికిత్స చేసి యువతి తల నుంచి 70 సూదులను బయటకు తీశారు. 4 సంవత్సరాల క్రితం యువతి అనారోగ్యానికి గురైంది. ఆ సమయంలో తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. యువతి తలపైనుంచి లోపలకు ఒక్కొక్కటిగా సూదులు చొప్పించాడు. ఇది నాలుగేళ్లుగా జరుగుతోంది. యువతి ఆరోగ్యం విషమించడం వల్ల ఆస్పత్రికి తీసుకురాగా శస్త్ర చికిత్స చేసి 70 సూదులు తొలగించారు వైద్యులు. దాదాపు 2 గంటల పాటు సర్జరీ జరిగింది. పుర్రె ఎముకపై ఉన్న సూదులు లోపలికి వెళ్లకపోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడిందని వింసార్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రబినారాయణ్ గురు తెలిపారు. పోలీసులు మాంత్రికుడు తేజ్రాజ్ ను అరెస్టు చేశారు.

Post a Comment

0 Comments

Close Menu