Ad Code

హైదరాబాద్‌లో భారీ వర్షం !


హైదరాబాద్‌ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. మరో గంట సేపు కుండపోత వర్షం కురిసే అవకాశముందని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. వర్షానికి సంబంధించి అత్యవసర సహాయం కోసం 040-21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. మియాపూర్‌, చందానగర్‌, లింగంపల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, బాచుపల్లి, ప్రగతి నగర్‌, కూకట్‌పల్లి, మూసాపేట, హైదర్‌నగర్‌, మల్కాజిగిరి, కుషాయిగూడ, దమ్మాయిపేట, చర్లపల్లి, కీసర, నిజాంపేట, నేరేడ్‌మెట్‌, అమీర్‌పేట్‌, ఈఎస్‌ఐ, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, బోరబండ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, ఉప్పల్‌, రామంతాపూర్‌, బోడుప్పల్‌, మేడిపల్లి, పీర్జాదిగూడ, నాంపల్లి, అబిడ్స్‌, కోఠి, బషీర్‌బాగ్‌, నారాయణగూడ, హిమాయత్‌ నగర్‌, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, మేడ్చల్‌, మల్లంపేట్‌, గండిమైసమ్మ, దుండిగల్‌, అంబర్‌ పేట, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై వర్షం నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వరద ప్రవాహానికి యూసుఫ్‌గూడలోని శ్రీకృష్ణనగర్‌లో ఓ కారు కొట్టుకుపోయింది.

Post a Comment

0 Comments

Close Menu