Ad Code

హారన్ కొడుతున్నా పట్టాలపై నుంచి తప్పుకోని వ్యక్తి - సోషల్ మీడియాలో వీడియో వైరల్ !


యువకుడు రైల్వే ట్రాక్స్ మధ్యలో నడుచుంటూ వెళ్తుంటాడు. అదే సమయంలో ఓ రైలు రివర్స్‌లో అటుగా వస్తుంది. యువకుడిని చూడగానే రైలు డ్రైవర్ హారన్ కొట్టాడు. అయితే ఎంత సేపు హారన్ కొడుతున్నా అతడు మాత్రం స్పందించలేదు. తనకేమీ వినపడనట్లుగా పట్టాల మధ్యలో అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాడు. రైలు సమీపానికి వస్తున్నా అతడిలో ఏమాత్రం భయం కనిపించలేదు. ఈ క్రమంలో రైలుపై ఉన్న సిబ్బంది గట్టిగా కేకలు వేస్తూ అతడిని హెచ్చరిస్తారు. అయినా ఆ యువకుడు మాత్రం పట్టాలపై అలాగే నడుచుకుంటూ వెళ్తుంటాడు. దీంతో చివరికి రైలుపై ఉన్న వారికి కోపం కట్టలు తెంచుకుంటుంది. రైలుపై ఉన్న వారిలో ఓ వ్యక్తి కిందకు దిగి పరుగెత్తుకుంటూ అతడి వద్దకు వెళ్తాడు. వెళ్లీ వెళ్లగానే ఓ కర్ర తీసుకుని అతడిని వీపుపై గట్టిగా కొడతాడు. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాకై పట్టాల పైనుంచి పక్కకు పరుగులు పెడతాడు. అతను అక్కడి నుంచి దూరంగా వెళ్లే వరకూ రైల్వే సిబ్బంది అతడిని కొడుతూ వెంటపడతాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ''ఇలాంటి వారికి ఇలాగే బుద్ధి చెప్పాలి''.. అంటూ కొందరు, ''సందేశం ఇచ్చేందుకు ఇదంతా కావాలని చేసినట్లు ఉంది''.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Post a Comment

0 Comments

Close Menu