Ad Code

ఢిల్లీ మెట్రో ఆల్-ఇన్-వన్ ట్రావెల్ కార్డు !


ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో చేతులు కలిపి, రకరకాల డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు ప్రయాణీకులు ఒక మెట్రో కార్డుతో అన్ని మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చు. ఇంకా ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌లోనూ వెళ్లొచ్చు. ప్రయాణికులకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా పర్వాలేదు. ఢిల్లీ మెట్రో కార్డుల ట్రాన్సాక్షన్లను ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ప్రాసెస్ చేస్తుంది. ఈ కార్డులు అన్ని మెట్రో స్టేషన్లలో లభిస్తాయి. ఈ కార్డుల ద్వారా ప్రజలు మెట్రో రైళ్లలోనే కాదు.. ప్రజా రవాణాలోనూ ప్రయాణించవచ్చు. దేశవ్యాప్తంగా వీటిని ఉపయోగించవచ్చు. సూపర్ మార్కెట్లలో ఈ కార్డులతో సామాన్లు కొనుక్కోవచ్చు, ఆన్‌లైన్‌లో ఐటెమ్స్ కొనుక్కోవచ్చు, అంతేకాదు ఈ కార్డుతో ఏటీఎంలలో మనీ విత్‌డ్రా చేసుకోవచ్చు, ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. మెట్రో కార్డు కేవలం మెట్రోకే పరిమితమై ఉంటే, దాని పరిధి తక్కువగా ఉండేది. కానీ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ దాన్ని దేశవ్యాప్తంగా వాడుకునేందుకు వీలు కల్పించడం వల్ల, ప్రయాణికులకు ఇది బాగా నచ్చుతోంది. ఇక ప్రజలు రకరకాల వాలెట్‌లు వాడాల్సిన అవసరం లేదనీ, తమ కార్డు ఉంటే సరిపోతుందని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అంటోంది. దేశ ప్రయాణాల్లో ఇది కొత్త మార్పుకి శ్రీకారం చుడుతుందని ఆశిస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu