Ad Code

పుంజుకున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు


నిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు గత కొన్ని రోజులుగా భారీ పతనం తర్వాత బుల్ ర్యాలీలో చేరాయి. దీంతో షేర్ ధర మళ్లీ రూ.200 మార్కును దాటింది. నేడు ఇంట్రాడేలో స్టాక్ 3 శాతం లాభపడి రూ.205.70 స్థాయిలకు చేరింది. గడచిన నాలుగేళ్లలో స్టాక్ తన పెట్టుబడిదారులకు ఏకంగా 2100 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. ఈ క్రమంలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.308 వద్ద ఉండగా కనిష్ఠ ధర రూ.143.70గా ఉంది. స్టాక్ ధర జనవరి 4, 2008లో అత్యధికంగా రూ.2510.35 వద్ద ఉంది. అక్కడి నుంచి అనిల్ అంబానీ స్టాక్ 99 శాతం పడిపోయి మార్చి 27, 2020లో రూ.9.20కి పడిపోయింది.ఇక మూడేళ్లల కాలాన్ని పరిశీలిస్తే రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు 167% కంటే ఎక్కువ రాబడిని అందించాయి. జూలై 30, 2021న అనిల్ అంబానీకి చెందిన కంపెనీ షేర్లు రూ.76.45 రేటు నుంచి జూలై 30, 2024న కంపెనీ షేర్లు రూ.205.70 పెరిగాయి. 2024లో కంపెనీ షేర్ల ధర జూన్ 5న కనిష్ఠమైన రూ.143.70కి దిగజారింది. అక్కడి నుంచి తిరిగి బుల్స్ జోరులో చేరిన రిలయన్స్ ఇన్‌ఫ్రా కంపెనీ షేర్లు దాదాపు 40 శాతానికి పైగా ఎగబాకాయి. అలాగే 6 నెలల కాలంలో స్టాక్ దాదాపు 12 శాతం పడిపోయాయి. ఈరోజు మధ్యాహ్నం 3.01 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో స్టాక్ ధర ఒక్కోటి రూ.202 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.7,984గా ఉంది.

Post a Comment

0 Comments

Close Menu