Ad Code

కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ !


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన సీబీఐ కేసులో  రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. బెయిల్ కోసం కేజ్రీవాల్ ట్రయల్ కోర్టును ఆశ్రయించాలన్న సీబీఐ వాదనలను సీనియర్ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ వ్యతిరేకించారు. ట్రయల్ కోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌పై చార్జిషీట్ దాఖలు చేసినట్లు సీబీఐ తరఫున న్యాయవాది డీపీ సింగ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చార్జిషీట్ దాఖలు చేయడం వల్ల కేజ్రీవాల్‌కు రెగ్యులర్ బెయిల్ పొందే అర్హత లేదని అభిషేక్ మను సింగ్ వాదించారు. దర్యాప్తును ముగించిన సీబీఐ సోమవారం కేజ్రీవాల్‌తో పాటు ఇతరులపై తన తుది ఛార్జిషీట్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తు సాగుతున్న కొద్దీ అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన మరిన్ని ఆధారాలు లభిస్తున్నాయని సీబీఐ కోర్టుకు తెలిపింది. సోమవారం సమర్పించిన ఛార్జిషీట్‌లో కేజ్రీవాల్‌తో సహా ఆరుగురి పేర్లు ఉన్నట్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఆరుగురిలో ఐదుగురిని ఇంకా అరెస్టు చేయలేదని పేర్కొంది. మనీష్ సిసోడియా ఆధ్వర్యంలోని ఐఏఎస్ అధికారి సి అరవింద్, విజయ్ నాయర్ కంప్యూటర్‌లో నమోదు చేసేందుకు ఎక్సైజ్ పాలసీ కాపీని తీసుకొచ్చారని తెలిపింది. ఆ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారని వాంగ్మూలం ఇచ్చారని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈడీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు మూడుసార్లు బెయిల్ మంజూరైంది సింఘ్వీ గుర్తు చేశారు. కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసినప్పటి నుంచి ఎటువంటి పరిణామాలు లేవన్నారు. బెయిల్, రిట్ పిటిషన్‌ల మధ్య వ్యత్యాసం కేసు మెరిట్‌పై ప్రభావం చూపదని ఆయన పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ప్రత్యక్ష సాక్ష్యం లేదని కోర్టుకు తెలిపారు. సీబీఐ తరచుగా విజయ్ నాయర్‌ను ఈ కేసులో కేంద్ర వ్యక్తిగా పేర్కొంటుందన్నారు.

Post a Comment

0 Comments

Close Menu