Ad Code

మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటనలో పోలీసు కస్టడీలో ఇద్దరు ఆర్డీఓలు !


ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాయలంలో జరిగిన అగ్నిప్రమాదంలో కీలక ఫైళ్ల దగ్ధంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై చంద్రబాబు ఒక్కరోజులోనే మూడు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. చంద్రబాబు స్వయంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి అగ్నిప్రమాదంపై ఆరా తీశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగి అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని డీజీసీ ద్వారకా తిరుమలరావు స్వయంగా పరిశీలించిన కొన్ని గంటల్లోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో పని చేస్తున్న ఆర్డీఓ హరిప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఆర్డీఓ హరిప్రసాద్ నివాసం ఉందని, అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసినా ఆ విషయాన్ని కలెక్టర్ కు, ఉన్నతాదికారులకు సమాచరం ఇవ్వకుండా ఆర్డీఓ హరిప్రసాద్ నిర్లక్షం చెయ్యడం అనేక అనుమానాలకు దారితీస్తోందని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్వయంగా మీడియాకు చెప్పారు. ఇదే సమయంలో గతంలో మదనపల్లె ఆర్డీఓగా పని చేసిన మురళి కూడా ఆదివారం మదనపల్లెలో ప్రత్యక్షం కావడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. గతంలో ఆర్డీఓగా పని చేసిన మురళి మదనపల్లె చేరుకుని ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్ ను కలిసి చర్చలు జరపడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ప్రమాదం జరిగిన రోజు పాత ఆర్డీఓ మురళి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మొత్తం మీద ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్ ను పోలీసు అధికారులు మదనపల్లెలోని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu