Ad Code

ప్రైవేట్ టెలికాం గట్టి పోటీనిస్తున్న బీఎస్ఎన్ఎల్ !


దేశంలోని టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్ల తర్వాత అంబానీని ఎదిరించే విధంగా బీఎస్ఎన్ఎల్ తయారవుతుంది. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు ప్రారంభించడంతో దేశంలోని ప్రముఖ ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ వంటి సంస్థల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఇటీవల రేట్లు కూడా పెరగగా, చాలా మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు అడుగులు వేశారు. ఈ పరిస్థితిని అర్ధం చేసుకున్న జియో టారిఫ్ రేట్లని మళ్లీ తగ్గించింది. అయితే ప్రస్తుత టెలికాం రంగంలో జియో, బీఎస్ఎన్ఎల్ మధ్య గట్టిపోటీ నడుస్తుంది. జియో, బీఎస్ఎన్ఎల్‌లలో నెలవారీ లేదా 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్ వస్తుండగా, అందులో జియో నుంచి రూ. 348, బీఎస్ఎన్ఎల్ నుంచి రూ. 108, రూ. 107 ప్లాన్లు ఉన్నాయి. రిలయన్స్ జియో రూ. 349 ప్రీ పెయిడ్ ప్లాన్ చూస్తే ఆ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ప్రతి రోజూ 2 జీబీ 5జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. ఇక ఈ ప్లాన్ తీసుకోవడం ద్వారా జియో సినిమా యాప్ నకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా మనం పొందవచ్చు. ఇక వీటితో పాటు యాడ్ ఆన్ ప్లాన్ లని కూడా అందిస్తుంది. ఇవి అన్ లిమిటెడ్ ప్లాన్లు. రూ. 151, రూ. 101, రూ. 51 ట్యారిఫ్ తో ఈ ప్లాన్లు ఉన్నాయి. రూ. 151 రీచార్జ్ తో 9జీబీ, రూ. 101 రీచార్జ్ తో 6జీబీ, రూ. 51 రీచార్జ్ తో 3జీబీ 4జీ డేటా లభిస్తుంది. మొదటి సారి రీచార్జ్ చేస్తున్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు రూ. 108 ప్లాన్ (మొదటి రీఛార్జ్ కూపన్) పొందవచ్చు. వీరికి 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్, ప్రతి రోజూ 1జీబీ 4జీ డేటా లభిస్తుంది. ఇదే ప్లాన్ రిపీట్ చేస్తే ఈ ప్లాన్ 35 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. దీనిలో 200 నిమిషాల వాయిస్ కాల్స్, 3 జీబీ 4జీ డేటా లభిస్తుంది.బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 797 ప్లాన్‌. ఈ రీఛార్జీ ప్లాన్‌ ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా ఈ ప్యాక్‌ తో రీఛార్జీ చేసుకుంటే 300 రోజులపాటు వ్యాలిడిటీ వస్తుంది. తరచూ రీఛార్జీలు చేసుకునే వినియోగదారులకు ఇది అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ఇది వినియోగదారులకు ఏడాదిపాటు నిరంతరాయ లాభాలను గడిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu