Ad Code

ఇన్‌స్టాగ్రామ్‌ లో రీల్స్‌లో బహుళ ఆడియో ట్రాక్‌లను యాడ్‌ చేసే ఆప్షన్‌ !


మెటా ఆధ్వర్యంలో ఫొటో, వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.రీల్స్‌లో బహుళ ఆడియో ట్రాక్‌లను యాడ్‌ చేసే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఫలితంగా యూజర్లు తమ రీల్స్‌లో ఒకటి కంటే ఎక్కువ ట్రాక్‌లను యాడ్‌ చేసుకునే అవకాశం ఉంది. తద్వారా రీల్స్‌ అనుభూతి మరింత మెరుగవుతుందని కంపెనీ తెలిపింది. ఈ కొత్త మల్టీ ట్రాక్‌ రీల్స్‌ ఫీచర్‌ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో ఇంకా కొంతమందికి ఇది కనిపించడం లేదు. ''ఇక నుంచి ఒక్క రీల్‌లో 20 వరకు ఆడియో ట్రాక్‌లను జత చేయొచ్చు. తద్వారా మీ కంటెంట్‌ను మరింత సృజనాత్మకంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. మీ ఆడియోను టెక్ట్స్‌, స్టిక్కర్‌, క్లిప్స్‌కు అనుగుణంగా ఎంచుకోవచ్చు. ఫలితంగా మీరు ఓ ప్రత్యేకమైన ఆడియో ట్రాక్‌ను సృష్టించే అవకాశం ఉంటుంది. నచ్చినవారు దాన్ని సేవ్‌ చేసుకొని వాడుకునే వీలుంటుంది'' అని ఇన్‌స్టా అధిపతి ఆడమ్‌ మొస్సేరీ తెలిపారు. అలా సృష్టించిన ప్రత్యేకమైన ఆడియో ట్రాక్‌లను వారి పేరు మీదే లేబుల్‌ చేస్తామని.. వారికి క్రెడిట్‌ ఇస్తామని వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌లో వీడియో ఎడిటర్‌ ఆప్షన్‌ ఓపెన్‌ చేయాలి. యాడ్‌ టు మిక్స్‌పై ట్యాప్‌ చేసి కావాల్సిన ట్రాక్‌లను ఎంచుకోవాలి. ఒక ఆడియోలో కావాల్సిన భాగాన్ని కూడా ఎంపిక చేసుకొనే వీలుంటుంది. పూర్తయిన తర్వాత రీల్‌ లైవ్‌లోకి వచ్చేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu