Ad Code

ఆపిల్ పండు - ఆరోగ్య ప్రయోజనాలు !


పిల్ పండు ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా ఎన్నో రకాలుగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ మరియు శరీరంలో పేర్కొన్న కొవ్వును కూడా కరిగించడంలో ఎంతో సహాయపడతాయి. అయితే ప్రతి రోజు ఒక గుడ్డు తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో, అలాగే ఈ పండును ప్రతి రోజూ ఒకటి తీసుకోవడం వలన కూడా అంతే లాభాలు కలుగుతాయి. అయితే షుగర్ తో బాధపడే వారు ఆపిల్ తీసుకోకూడదు అంటారు. అలాగే ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలను నియంత్రించడంలో కూడా దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. ఒక్క ఆపిల్ లో కోట్లలో బ్యాక్టీరియా ఉంది అని నిపుణులు అంటున్నారు. ఆస్ట్రేలియాలోని గ్రాజ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ చేసినటువంటి పరిశోధనలో 40 గ్రాములు బరువు ఉన్నటువంటి ఒక యాపిల్ లో సుమారుగా 10 కోట్ల వరకు ఈ బ్యాక్టీరియా అనేది ఉంది అని అధికారులు తెలిపారు. సాధారణంగా మనం ఆపిల్ ను తొక్క, కాడ, గింజలు ఇలా అన్నింటిని తీసి పడేసి లోపలి భాగాన్ని తింటూ ఉంటాం. ఇలా చేయడం వలన దీనిలో ఉన్న చాలా బ్యాక్టీరియాను నష్టపోయిన వారు అవుతారు అని నిపుణులు అంటున్నారు. ఇదంతా కూడా మంచి బ్యాక్టీరియానే అని, మన శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియాను నియంత్రించి ఆరోగ్యాన్ని రక్షించటంలో ఎంతో బాగా పని చేస్తుంది అని అంటున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu