Ad Code

వస కొమ్ము - ఆరోగ్య ప్రయోజనాలు !


దేశంలో గ్రామాల్లో పుట్టిన ప్రతి బిడ్డకు పురిట్లోనే వస కొమ్మును చనుబాలతో అరగదీసి పట్టేవారు. ఇలా చేయడం వలన చిన్న పిల్లలకు కఫం ఉండదని.. నాలిక పలచ బడి మాటలు స్పష్టంగా త్వరగా వస్తాయని భావించే వారు. అయితే ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని కొన్ని గ్రామాల్లో కొనసాగిస్తూనే ఉన్నారు. అందుకనే ఎవరైనా ఎక్కువగా మాట్లడుతున్నా అనర్గళంగా మాట్లాడ్తున్న వస పిట్ట అంటూ కామెంట్ చేస్తారు. అలాంటి ఈ వసను వందల ఏళ్లుగా ఆయుర్వేదంలో అనేక రకాల వ్యాధులకు చికిత్సగా ఉపయోగిస్తున్నారు. హిమాలయాల్లో దొరికే వస వెరీ వెరీ స్పెషల్.. దీనిని వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వసలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. వస వలన జీర్ణ సమస్యలు, శరీర వాపులు, నొప్పులు, అధిక కొవ్వు వంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం వాపుతో ఇబ్బంది పడుతుంటే వసకొమ్ముల పొడిని ఆవనూనెతో కలిపి శరీరానికి అప్లై చేస్తే శరీరపు వాపు తగ్గుతుంది. ఎవరైనా ఆందోళన, ఒత్తిడితో పాటు జ్ఞాపక శక్తి తగ్గుతుంటే పస బెస్ట్ మెడిసిన్. అంతేకాదు మూత్రపిండాలలోని రాళ్ల నుంచి ఉపశమనం ఇస్తుంది. నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఆకలి తగ్గినా, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి వస చూర్ణం మంచి ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణాశయంలో అగ్నిని పెంచడంతో జీర్ణశక్తి పెరుగుతుంది. ఎవరైనా జీర్ణాశయ సంబధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అల్సర్లకు, గ్యాస్‌, అసిడిటీ సమస్యలతో పాటు విరేచనాలు, చర్మ సమస్యలకు వస తో చెక్ పెట్టవచ్చు. మూర్చ వ్యాధితో ఇబ్బంది పడుతుంటే వసకొమ్ము పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వలన మూర్చ వ్యాధి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అసిడిటీ సమస్యతో ఇబ్బంది పడేవారు వస చూర్ణాన్ని తేనె, బెల్లంతో కలిపి తీసుకోవడం వలన అసిడిటీ సమస్య నుంచి బయటపడతారు. జుట్టు ఊడిపోతుంటే వసకొమ్ము, దేవదారు వేరు లేదా గురవింద గింజలను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని జుట్టు ఊడిన చోట అప్లై చేస్తే జుట్టు పెరుగుతుంది. గాయాలు, పుండ్లతో ఇబ్బంది పడుంటే వాటిని వేడి నీరుతో శుభ్రం చేసి తర్వాత వస కొమ్ముని వేసి కాచిన నీటితో మళ్ళీ శుభ్రం చేయాలి. వస నూనెలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి రాస్తుంటే కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మొలలతో ఇబ్బంది పడుతుంటే ముందుగా నువ్వుల నూనేను వేడి చేసి ఆ మొలల మీద అప్లై చేసి.. తర్వాత వస కొమ్ములను, సోంపుని కలిపి నూరి ఆ మిశ్రమాన్ని మొలలకు అప్లై చేయాలి. ఇలా చేయడం వలన మొలల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదనపు కొవ్వుతో ఇబ్బంది పడుతుంటే ఒక టీస్పూన్‌ వస చూర్ణం, ఒక టీ స్పూన్ త్రిఫల చూర్ణం వేసి కొంచెం నీరు వేసి పేస్ట్ గా చేయాలి. ఈ మిశ్రమాన్ని కొవ్వు ఉన్న పొట్ట మీద, తొడలపై అప్లై చేయాలి. ఇలా చేయడం వలన కొవ్వు కరుగుతుంది.

Post a Comment

0 Comments

Close Menu