Ad Code

బెడ్ ను పరిశుభ్రంగా ఉంచుకొనే విధానం !


బెడ్ పై ఉండే పరుపును క్లీన్ చేసుకోవడం అంటే కేవలం నీట్ గా కనిపించడానికే అనుకుంటాం. కాని దానిపై కంటికి కనిపించని దుమ్మూ దూళి, పురుగులు, బ్యాక్టీరియా, చర్మానికి సంబంధించిన మృత కణాలు వంటి సూక్ష్మ క్రిములు లక్షల్లో చేరి ఉంటాయి. వాటిని అలాగే వదిలేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సైతం దారితీసే ప్రమాదం ఉంది. అందుకే పరుపును పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. 200 గ్రాముల బేకింగ్ సోడా తీసుకోవాలి. దానిని ఓ చిల్లుల గిన్నెలో పోసి బెడ్ పై అంతటా పొడి పడేలా చిలకరించాలి. 30 నిముషాల పాటు అలాగే వదిలేసి వ్యాక్యూమ్ తో లేదా హై స్పీడ్ టేబుల్ ఫ్యాన్ తో బెడ్ పై ఫోర్స్ గా గాలి తగిలేలా చేయాలి.ఇలా చేస్తే సోడాతో సహా బ్యాక్టీరియా మొత్తం పరుపును వదిలి శుభ్రం అవుతుంది. పరుపును ఇంతకుముందు శుభ్రం చేసి చాలా కాలం అయితే గనుక మరోసారి బేకింగ్ సోడాను చల్లుకుని వాక్యూమ్ తో క్లీన్ చేయాలి.పరుపు క్లీన్ కావడంతో పాటుగా సువాసన వస్తుంది. బెడ్ పై ప్రశాంతమైన నిద్ర వాతావరణం ఏర్పడుతుంది. ఈ చిట్కా ఫాలో అయితే మంచి ప్రయోజనం కనపడుతుంది.


Post a Comment

0 Comments

Close Menu