Ad Code

ఆంధ్రప్రదేశ్ ని వీడని అల్పపీడనాలు !


బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్ప పీడనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో జోరుగా వానలు కురుస్తు న్నాయి. దాదాపు రెండు వారాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. ఈరోజు కూడా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఏలూరు, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఎన్టీఆర్ జిల్లా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడనున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వానలకు ధవళేశ్వరం వద్ద గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. దీనివల్ల అక్కడ గోదావరి ఉగ్రంగా ప్రవహిస్తోంది. బ్యారేజ్లో 12.05 లక్షల క్యూసెక్కుల నీరు ఉన్నట్లు విపత్తుల సంస్థ వెల్లడించింది. ఇప్పటికే అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీచేయబోతున్నారు. అత్యవసరంగా సహాయం చేసేందుకు నాలుగు ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. అలాగే మరో నాలుగు ఎస్డీఆర్ ఎఫ్ బలగాలను కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది.

Post a Comment

0 Comments

Close Menu