Ad Code

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస !


జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. శనివారం ఉదయం కౌన్సిల్ సమావేశానికి ముందే బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. మేయర్ పోడియం ముట్టడించి మేయర్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. దీంతో సమావేశ మందిరంలో గందరగోళం నెలకొన్నది. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్పొరేటర్లను తమ స్థానాల్లో కూర్చోవాలని సభ్యులను కోరినప్పటికీ వారు వినకపోవడంతో సమావేశాన్ని 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశం ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పురాలేదు. బీఆర్ఎస్ సభ్యులు మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో ఆమె తన సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే లాస్యా నందితా మృతికి కార్పొరేట్లు సంతాపం తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu