Ad Code

విండోస్‌లో మరోసారి క్క్రౌడ్‌స్ట్రైక్‌ పరిస్థితి రావచ్చు : మైక్రోసాఫ్ట్‌


మైక్రోసాఫ్ట్‌లో ఈనెల 19న తలెత్తిన అంతరాయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా విండోస్‌ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 11 గంటల సమయంలో కంప్యూటర్లు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. ఈ సమస్యను బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ ఎర్రర్‌గా పేరొన్నారు. క్క్రౌడ్‌స్ట్రైక్‌ లో అప్‌డేట్‌ కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో లక్షలాది మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అదే రోజు మైక్రోసాఫ్ట్‌ ఈ సమస్యను పరిష్కరించింది. అయితే తాజాగా మైక్రోసాఫ్ట్‌ ఓ ప్రకటన చేసింది. భవిష్యత్‌లో మరోసారి క్రౌడ్‌స్ట్రైక్‌ తరహా అంతరాయం తలెత్తే అవకాశం ఉందని, ఆ పరిస్థితి రాకుండా నిరోధించే అవకాశం లేదని మైక్రోసాఫ్ట్‌ చెబుతోంది. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. యూరోపియన్‌ కమిషన్‌ ఇటీవల రూపొందించిన కొత్త నిబంధనే ఇందుకు కారణంగా తెలుస్తోంది. థర్డ్ పార్టీ విక్రేతలకు కూడా ఓఎస్ కెర్నల్‌ వెర్షన్‌ పూర్తి యాక్సెస్‌ను పొందేలా కొత్త నిబంధనను యూరోపియన్‌ కమిషన్‌ తీసుకొచ్చింది. అంటే మైక్రోసాఫ్ట్ ఇంజినీర్లకు ఉండే స్థాయిలోనే క్రౌడ్‌ స్ట్రైక్‌ వంటి థర్డ్‌ పార్టీ సంస్థల ఇంజినీర్లకు పూర్తి యాక్సెస్‌ ఉంటుంది. WSJ నివేదికలో మైక్రోసాఫ్ట్‌ ఈ ప్రస్తావన చేసింది. మైక్రోసాఫ్ట్‌లో ఇటీవల తలెత్తిన అంతరాయం కారణంగా సుమారుగా రోజంతా అనేక సంస్థలు తమ కార్యకాలాపాలను నిర్వహించలేకపోయాయి. విమానయాన రంగంపైనా ప్రభావం పడింది. అనేక విమానాల రద్దు సహా ఆలస్యంగా ప్రయాణాలను ప్రారంభించాయి. అయితే మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యపై అనేక మంది సైబర్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే క్రౌడ్‌ స్ట్రైక్‌ సంస్థ మాత్రం దీనిపై వివరణ ఇచ్చింది. విండోస్‌లో కేవలం సాంకేతిక అంతరాయం మాత్రమే తలెత్తిందని, ఎటువంటి భద్రతా మరియు సైబర్‌ అటాక్‌ కాదని స్పష్టంచేసింది. ఈ సమస్య విండోస్‌ సిస్టమ్‌లలోనే తలెత్తింది. ఆపిల్‌ యూజర్లు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొలేదు. ఎందుకంటే థర్డ్‌ పార్టీ విక్రేతలకు విండోస్‌ తరహా యాక్సెస్‌ను ఆపిల్‌ అందించలేదు.


Post a Comment

0 Comments

Close Menu