Ad Code

ఇన్ స్టాగ్రామ్ లో నచ్చిన విధంగా ఏఐ క్యారెక్టర్లు సృష్టించే అవకాశం?


న్ స్టాగ్రామ్ వినియోగదారులు కస్టమైజ్డ్ ఏఐ చాట్ బాట్ లను అభివృద్ధి చేయడానికి, డిజైన్ చేయడానికి వీలుగా ఏఐ స్టూడియో అనే కొత్త టూల్ ను విడుదల చేయనుందట !. ఈ కొత్త ఏఐ టూల్ తో ఇన్ స్టా యూజర్లు, కంటెంట్ క్రియేటర్లు తమకు నచ్చిన ఏఐ క్యారెక్టర్లను సృష్టించుకోవచ్చు. వాటిని ఇంటరాక్టివ్ గా తమ పేజ్ లో ఉపయోగించుకోవచ్చట. ఏఐ క్యారెక్టర్లను ఉపయోగించి మెటా ప్లాట్ ఫామ్స్ లో క్రియేటర్లు చాలా చేయవచ్చట. వారి సొంత కస్టమైజ్డ్ ఏఐ క్యారెక్టర్లను సృష్టించడంతో పాటు, ఆ ఏఐ క్యారెక్టర్లతో ఇంటరాక్టివ్ సెషన్స్ ను నిర్వహించవచ్చట. ఫాలోవర్ల సాధారణ ప్రశ్నలకు జవాబులు ఇవ్వవచ్చట. ఏఐ మెటా స్టూడియో ద్వారా మీ ప్రతినిధిగా ఇన్ స్టాలో ఈ ఏఐ క్యారెక్టర్లను అభివృద్ధి చేయవచ్చని చెబుతున్నారు. మెటా యాజమాన్యంలోని వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వినియోగదారులు తమ కస్టమైజ్డ్ ఏఐ క్యారెక్టర్లను పంచుకోవచ్చట. అయితే ఈ ఈ టూల్ ను మెటా లామా 3.1 ను ఉపయోగించి అభివృద్ధి చేశారు. ఇది ఎక్కువగా ఉచిత కృత్రిమ మేధస్సు మోడళ్ల ను అందిస్తుంది. గత వారం లాంచ్ అయిన మెటా లామా 3.1 ను వివిధ భాషల్లో యాక్సెస్ చేయవచ్చు. ఇది ఓపెన్ఎఐ వంటి పోటీదారులు విడుదల చేసిన పెయిడ్ మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu