Ad Code

తిరుపతిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణ అకృత్యం !


ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఒకరు తన వదిన, ఇద్దరు బిడ్డలపై దారుణంగా చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. దారుణానికి పాల్పడటానికి ముందు వరకు అన్నతో కలిసి మద్యం తాగుతూ ఉన్నాడు. కాసేపటి తర్వాత అన్న బయటకు వెళ్లడంతో మృతుడు ఇంట్లోకి వెళ్లి అన్న భార్య అనగా వదిన, వారి ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఆ తర్వాత అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దారుణం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీపీ దాస్‌ అనే వ్యక్తి తిరుపతి పద్మావతి నగర్‌లోని ఓ ఇంట్లో భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసం ఉంటున్నాడు. దాసు తమ్ముడు మోహన్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ఐదేళ్ల క్రితం అనగా.. 2019లో వివాహమైంది. అయితే పెళ్లైన ఏడాదిలోపే అనగా 2020లో మోహన్ భార్య అతడి నుంచి విడిపోయింది. కొన్నాళ్ల తర్వాత.. మోహన్‌ అన్నావదినలు.. అతడికి మరో వివాహం చేశారు. అయితే రెండో భార్య కూడా మోహన్ నుంచి విడిపోయింది. ఇద్దరు భార్యలు వదిలేసి వెళ్లడంతో మోహన్‌ మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో తాజాగా మోహన్‌.. తిరుపతిలోని తన అన్న ఇంటికి వచ్చాడు. ఇద్దరు కలిసి ఇంట్లో కూర్చుని మద్యం సేవించారు. కాసేపటి తర్వాత.. మోహన్‌ అన్న దాస్ ఏదో పని నిమిత్తం.. బయటకు వెళ్లాడు. ఇదే అదునుగా.. మోహన్ కత్తి తీసుకుని వదిన సునీత, కూతుళ్లు దేవ శ్రీ, నీరజలపై దాడి చేశాడు. వారిని విచక్షణారహితంగా నరికాడు. ముగ్గురు రక్తపు మడుగులో పడిపోగా.. వారి మృతదేహాలను బయటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే చుట్టుపక్కల జనాలు కనిపించడంతో.. వారిని బయటకు తీసుకెళ్లలేదు. ఆ తర్వాత భయంతో ఉరి వేసుకుని.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక బయటకు వెళ్లిన దాస్ తిరిగి ఇంటికి వచ్చాడు.. లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో తలుపులు నెట్టినా తెరుచుకోలేదు. వెంటనే స్థానికులతో కలిసి తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా భార్యాపిల్లలు ముగ్గురు హాలులో రక్తపు మడుగులో పడి ఉండటం చూశాడు. ఇంట్లో లోపలి గదిలోకి వెళ్లి చూడగా మోహన్ కూడా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఇక దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రుయాకు తరలించారు. 

Post a Comment

0 Comments

Close Menu