Ad Code

ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు !


2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ ఫీజులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలో 210 బీటెక్ కాలేజీలు, 2 ఆర్కిటెక్చర్ కాలేజీలకు ఫీజు ఫైనల్ చేసింది. అత్యధికంగా 1.05 లక్షల ఫీజు సెట్ చేసింది. అలాగే కనీస ఫీజుగా 40,000ను నిర్ణయించింది. ఆర్కిటెక్చర్ ఫీజు 35,000గా ప్రభుత్వం ఫైనల్ చేసింది. మొత్తం 114 కాలేజీల్లో 40 వేల ఫీజు సెట్ చేసింది. 8 కాలేజీలకు ఫీజు లక్ష రూపాయలకు పైగా ఉంది. ట్యూషన్, అఫిలియేషన్, ఐడి కార్డ్, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యక్రమాలు అన్ని ఫీజులోనే ఉండే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది.


Post a Comment

0 Comments

Close Menu