Ad Code

భారత్ శక్తిని ప్రపంచం గమనించింది : ప్రధాని మోడీ !


ష్యాలో వరుసగా రెండో రోజు పర్యటిస్తున్న ప్రధాని మోడీ ఇవాళ అక్కడి భారతీయులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారితో పలు విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా భారత్-రష్యా బంధం పటిష్టంగా ఉంచడంలో అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ కృషిని మోడీ ప్రశంసించారు. మాస్కోలో భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. 140 కోట్ల మందికి పైగా భారతీయులు దేశ పునరుజ్జీవనాన్ని సుసాధ్యం చేస్తున్నట్లు మోడీ వారికి తెలిపారు. భారతీయులు పెద్ద పెద్ద కలలు కంటారని, ప్రతిజ్ఞ చేసి మరీ వాటిని సాకారం చేసుకుంటారన్నారు. అలాగే టీ20 వరల్డ్ కప్ లో భారత్ సాధించిన అద్వితీయ విజయాన్ని కూడా ప్రధాని మోడీ గుర్తు చేశారు. 2014కు ముందు మనం నిరాశా నిస్పృహల్లో ఉండేవాళ్లమని, ఇవాళ దేశం ఆత్మవిశ్వాసంతో నిండిపోయిందన్నారు. ఒకే అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు రోగులు ఒకే ఆసుపత్రిలో ఉన్నారు, అంత సమర్థులైన వైద్యులు వారికి చికిత్స చేస్తున్నారన్నారు. కానీ ఒక రోగి ఆశాజనకంగా ఉంటే, మరికొందరు నిరాశలో ఉన్నారన్నారు. ఆశాజనకంగా ఉన్నవారు త్వరలో కోలుకుంటారని మీరు చూస్తారని మోడీ విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భారత్ టీ20 ప్రపంచకప్ విజయాన్ని రష్యాలో భారతీయులు వేడుకగా జరుపుకోవాలని మోడీ సూచించారు. ఆ గెలుపు అసలు కథ దాని వైపు పయనించడమే అన్నారు. నేటి యువ భారత్ చివరి బంతి, చివరి క్షణం వరకు ఓటమిని అంగీకరించదన్నారు.తన ప్రభుత్వ విజయాలను కూడా రష్యాలో భారతీయులకు మోడీ గుర్తుచేశారు. జీ20 సదస్సుకు ఆతిధ్యమిచ్చినా, 40 వేల కిలోమీటర్ల రైలు మార్గాలు విద్యుదీకరించినా భారత్ శక్తిని ప్రపంచం గమనించిందన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu