Ad Code

పునర్విభజన చట్టం కింద అనేక హామీలను తెలంగాణలో అమలు చేశాం!


భారాస, కాంగ్రెస్‌ నేతలు పోటీపడి మరీ ప్రధాని మోడీని విమర్శిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లీస్తోందని, ఓట్ల కోసం తప్ప ప్రజలకు నిధులు ఖర్చు చేయట్లేదని ఆరోపించారు. సంక్షేమ పథకాల కోసం కేంద్రం రూ.6 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని భారాస, కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ''పునర్విభజన చట్టం కింద అనేక హామీలు అమలు చేశాం. రామగుండంలో విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశాం. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేశారు. గిరిజన వర్సిటీ కోసం కేంద్రం నిధులు మంజూరు చేసింది. జీఎస్టీ పరిహారం కింద రూ.7వేల కోట్లు అందజేశాం. జాతీయ రహదారుల కోసం రూ.1.10లక్షల కోట్లు ఖర్చు చేశాం. ఇప్పటికే రూ.వేల కోట్లతో రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ కోసం రూ.700 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం రూ.1,248 కోట్లు కేటాయించింది''అని కిషన్‌రెడ్డి తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu