Ad Code

ఫ్లిప్‌కార్ట్ లో ఫాస్టాగ్ రీఛార్జ్, ఫోన్ బిల్లు పేమెంట్స్ !


ఫ్లిప్‌కార్ట్ రీఛార్జ్, బిల్లు పేమెంట్ల ఆప్షన్లను కూడా ప్రవేశపెట్టింది. ఈ కొత్త సర్వీసుల్లో ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్‌లు, ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ పోస్ట్‌పెయిడ్ బిల్లు పేమెంట్లు ఉన్నాయి. విద్యుత్, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్‌ల కోసం ఇప్పటికే ఉన్న ఆప్షన్లకు అదనంగా కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలను భారత్ బిల్ పేమెంట్స్ సిస్టమ్ తో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా కంపెనీ దేశంలోని టాప్ పేమెంట్ సొలుష్యన్స్ ప్రొవైడర్ బిల్‌డెస్క్‌తో కలిసి పనిచేసింది. కస్టమర్‌లు నేరుగా ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా మల్టీ బిల్లు పేమెంట్లను చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌ల కోసం ఫ్లిప్‌కార్ట్ యూపీఐ లావాదేవీలతో సూపర్ కాయిన్స్ ద్వారా 10 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ పరిమిత కాల ఆఫర్ ఫ్లిప్‌కార్ట్‌లో బిల్లులను వేగంగా పూర్ తిచేసేందుకు అనుమతిస్తుంది. బీబీపీఎస్ సర్వీసులను ఫ్లిప్‌కార్ట్‌కు విస్తరించడం పట్ల బిల్‌డెస్క్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ అజయ్ కౌశల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యంతో ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌లు బిల్లు చెల్లింపులను సకాలంలో నోటిఫికేషన్‌లను పొందవచ్చు. బిల్లర్‌లలో చెల్లించాల్సిన మొత్తాలను చెక్ చేయొచ్చునని పేర్కొన్నారు. ఇటీవల ఫ్లిప్‌కార్ట్ యూపీఐ సర్వీసులను ప్రవేశపెట్టింది. రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపులకు సురక్షితమైన ఆప్షన్ అందిస్తోంది. కస్టమర్‌లు సూపర్ కాయిన్స్ క్యాష్‌బ్యాక్ ద్వారా రివార్డ్‌లను పొందవచ్చు. సింగిల్-క్లిక్, వేగంగా పేమెంట్స్ చేయొచ్చు. ఈ సర్వీసుతో వినియోగదారులు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసినా లేదా బిల్లులు చెల్లిస్తున్నా, మొత్తం డిజిటల్ పేమెంట్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. 


Post a Comment

0 Comments

Close Menu