Ad Code

తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తాం : నారా లోకేశ్‌


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ తల్లికి వందనం పథకాన్ని తాము అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు మాట ఇచ్చినట్టుగానే ఒక ఇంట్లో బడికి వెళ్లే పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. తల్లికి వందనం పథకంపై మార్గదర్శకాలు రూపొందించడానికి తమకు కొంత సమయం కావాలని లోకేశ్‌ తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు జరగకూడదన్నదే తమ లక్ష్యమన్నారు. అర్హులు ఎంతమంది ఉన్నా అంతమందికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని స్పష్టం చేశారు.


Post a Comment

0 Comments

Close Menu