Ad Code

వైసీపీ ఆఫీసుల కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ !

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కార్యాలయాలు కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కూల్చివెతల విషయంలో చట్టప్రకారమే వ్యవహరించాలని స్పష్టం చేసింది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల్లోగా భవన నిర్మాణాల అనుమతులు అధికారులకు సమర్పించాలని చెప్పింది. కూల్చివేతల్లో చట్టనిబంధనలు పాటించాలని తెలిపింది. ప్రతి దశలో వైసీపీ తరఫున వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని చెప్పింది. పబ్లిక్‌కు ఇబ్బంది కలిగేలా ఉన్న సందర్భంలో కూల్చివేతలపై ఆలోచన చేయాలని తెలిపింది. ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి వైసీపీ కార్యాలయాలు కూల్చివేస్తోంది పిటిషన్లు వైసీపీ నేతలు దాఖలు చేశారు. అయితే కూల్చివేతలు ఆపాలని హైకోర్టు ఆదేశాలు ఇస్తుందని వైసీపీ నేతలు భావించారు. చట్టప్రకారం వ్యవహరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో వైసీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. ప్రభుత్వం నెక్ట్స్ స్టెప్ ఏంటన్న ఆంశం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 22న ఉదయం తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీసులను అధికారులు కూల్చివేశారు. ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న వైసీపీ ఆఫీసులపై అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆయా ఆఫీసులను నిర్మిస్తున్నారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu