Ad Code

విమానాశ్రయంలో సీపీఆర్‌ చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడిన వైద్యురాలు : వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ !


ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఓ 60 ఏళ్ల వృద్ధుడు మరో పట్టణానికి వెళ్లేందుకు వచ్చాడు. అయితే అప్పుడే ఆయనకు గుండెనొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న ప్రియ అనే వైద్యురాలు ఇది గమనించి ఆ వృద్ధుడికి సీపీఆర్‌ చేయడం మొదలుపెట్టారు. దాదాపు ఐదు నిమిషాలపాటు ఆపకుండా సీపీఆర్‌ చేసి ఆ వృద్ధుడి ప్రాణాలు కాపాడారు. ఈ నెల 17న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇవాళ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై డాక్టర్‌ ప్రియ మాట్లాడుతూ 'ముందుగా చెప్పాల్సింది ఏమిటంటే భగవంతుడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. మనం కేవలం దేవుడి ప్రతినిధులం మాత్రమే. మనం ఏంచేసిన ఆయన ఆజ్ఞతోనే చేయగలుగుతాం. మేం అమర్నాథ్‌ యాత్రకు వెళ్లి తిరిగివస్తుండగా మా విమానం 2.30 గంటలు ఆలస్యంగా ఢిల్లీకి చేరుకుంది. మా పక్కనే ఓ స్టాల్‌ దగ్గర నిలబడిన ఒక పెద్దాయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మేం వెంటనే ఆయన దగ్గరికి పరుగెత్తాం. అప్పుడు నా వెంట నా భర్త డాక్టర్‌ రమాకాంత్‌ గోయెల్‌, మరో డాక్టర్‌ దంపతులు ఉమేశ్‌ గోయెల్‌, డాలీ గోయెల్‌ ఉన్నారు' అని తెలిపారు. 'మేం వెళ్లేసరికి వృద్ధుడు స్పృహ లేకుండా పడి ఉన్నాడు. శ్వాస తీసుకోవడం లేదు. దాంతో మేం వెంటనే సీపీఆర్‌ చేయడం ప్రారంభించాం. ఒక ఐదు నిమిషాల తర్వాత వృద్ధుడికి స్పృహ వచ్చింది. శ్వాస తీసుకోవడం మొదలైంది. కాసేపటికే ఆయనలో పల్స్‌ స్టార్ట్‌ అయ్యింది. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు సిబ్బంది వచ్చి ఆయనను ఆస్పత్రికి తరలించారు' అని డాక్టర్‌ ప్రియ తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu