Ad Code

డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా కొనేందుకు యజమాని ఇంట్లో చోరీకి పాల్పడిన పని మనిషి !


ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఓ బంగ్లాలో నీతూ యాదవ్‌ (30) అనే మహిళ పని చేస్తోంది. సోషల్‌ మీడియా ద్వారా ఫేమస్‌ కావాలన్నది ఆమె ఆశయం. ఇన్‌స్టా రీల్స్‌ చేసి పోస్టు చేస్తుండేది. ఇలా కాకుండా యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించి డబ్బు సంపాదించాలనుకుంది. రీల్స్‌ చేసేందుకు డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా కొనేందుకు తగిన డబ్బు లేకపోవడంతో బంధువులను అడిగినా ఎవరూ సహకరించలేదు. దీంతో ఏకంగా తన యజమాని ఇంటికి ఎసరు పెట్టింది. సరైన సమయం చూసి బంగారం, వెండి సహా విలువైన వస్తువులతో పరారైంది. ఆ తర్వాత ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేసింది. నగలు కనిపించకపోవడంతో యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికుల సమాచారంతో ఆచూకీ తెలుసుకున్నారు. ఆభరణాల బ్యాగ్‌తో నగరం దాటేయాలనుకున్న నీతూ యాదవ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను రాజస్థాన్‌ వాసిగా గుర్తించారు. తన భర్త డ్రగ్స్‌కు బానిసయ్యాడని, వేధింపులు తాళలేక ఢిల్లీకి వచ్చానని నిందితురాలు తెలిపింది. యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించేందుకు ఖరీదైన కెమెరా కావాలని కొందరు సలహా ఇచ్చారని, ఎక్కడా అప్పు పుట్టకపోవడంతో యజమాని ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడించింది. 

Post a Comment

0 Comments

Close Menu