Ad Code

ఉల్లిపాయ రసం - ఉపయోగాలు !


ప్రతి రోజు ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసాన్ని పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉల్లిపాయ రసంలో యాంటీ ఎనర్జీ, యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ కర్సినో జెనిక్,యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఉల్లిపాయ రసం రక్తపోటును నియంత్రించటంలో, బరువును కంట్రోల్ చేయడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ రసం దంతాలు, చిగుళ్ళకు ఎంతో బాగా ఉపయోగ పడుతుంది. అలాగే దంతాలు మరియు చిగుళ్లలో నొప్పిని బలపరచడమే కాక తొందరగా ఉపశమనాన్ని కలిగిస్తుంది.  రక్తపోటును నియంత్రించడంలో కూడా ఈ రసం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ  రసాన్ని తీసుకోవటం వలన రోగ నిరోధక శక్తి అనేది ఎంతగానో మెరుగుపడుతుంది. అలాగే ముఖ్యంగా మారుతున్నఈ సీజన్ లో దీనిని తీసుకోవటం వలన సిజనల్ ఇన్ఫెక్షన్లు దరి చేరవు. బరువు తగ్గడానికి కూడా ఈ ఉల్లిపాయ రసం ఎంతో మేలు చేస్తుంది. ఈ రసాన్ని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని ఉదయం లేవగానే పరిగడుపున తీసుకోవాలి. ఇలా చేయడం వలన శరీరంలోని కొవ్వు తొందరగా కరుగుతుంది. అంతేకాక శరీరంలోని టాక్సిన్స్ కూడా మూత్రం ద్వారా బయటకు వెళతాయి. ఉల్లిపాయ రసం తీసుకోవటం వలన శరీరానికి శక్తిని ఇవ్వటమే కాక యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. ఇది శరీరం నుండి వాపులను నియంత్రించడంలో కూడా ఎంతో బాగా మేలు చేస్తుంది..


Post a Comment

0 Comments

Close Menu