Ad Code

పామును పట్టి సంచిలో పొట్లకాయను వేసుకున్నట్లుగా వేసుకొని వెళ్లిన లేడీ స్నేక్ క్యాచర్ - సోషల్ మీడియాలో వీడియో వైరల్ !


ఫీసులోని కంప్యూటర్‌లో పాము దాక్కుందని తెలిసి స్టాఫ్ అంతా హడలిపోయి స్నేక్ క్యాచర్‌కి కాల్ చేస్తే ఓ యువతి వచ్చి బుసలు కొడుతున్న పాముని సరదాగా పట్టుకొని సంచిలో పొట్లకాయను వేసుకున్నట్లుగా వేసుకొని తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు ఈవీడియోకి లక్షల్లో వ్యూస్, వేలల్లో కామెంట్స్ వస్తున్నాయి. బిలాస్‌పూర్‌కు చెందిన అజిత అనే యువతి ఈ వీడియోని తన Instagram @invincible._ajita పేరుతో ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో షేర్ చేసింది. ఈమె వృత్తిరీత్యా పాములు పట్టేవారు (స్నేక్ క్యాచర్). అయితే ఆమె ఇన్‌స్టా ఖాతాలో ఇలాంటి వీడియోలు మరిన్ని ఉన్నాయి. ఆ వీడియోలు చూస్తే ఆమె పాములను పట్టుకోవడంలో ఎంత పర్‌ఫెక్టో అర్ధమవుతుంది.అయితే మనం మాట్లాడుకుంటున్న వీడియో (గర్ల్ క్యాచ్ ర్యాట్ స్నేక్ వెనుక కంప్యూటర్ వీడియో) చాలా షాకింగ్ గా ఉంది. పామును చూసి భయపడిపోయే చోటికి అజితను పిలిచారు. ఈ ప్రదేశం పాఠశాలో లేక కంప్యూటర్ సెంటర్ అనో తెలియదు కానీ అక్కడ ఉన్న ఉపాధ్యాయుల భయాన్ని అజిత ధైర్యంగా పోగొట్టింది.

Post a Comment

0 Comments

Close Menu