Ad Code

బంగ్లాదేశ్ వ్యాప్తంగా కర్ఫ్యూ అమలు !


బంగ్లాదేశ్ లో ప్రారంభమైన రిజర్వేషన్ ఉద్యమం తీవ్ర హింసారూపం తీసుకుంది. రిజర్వేషన్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ప్రారంభమైన వివాదంలో ఘర్షణలు చెలరేగడంతో దాదాపు వందమందకి పైగా విద్యార్థులు మరణించారు. దీంతో షేక్ హసీనా ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కర్ఫ్యూను అమలు చేసింది. దేశ వ్యాప్తంగా సైనిక బలగాలను మోహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. అధికార అవామీ లీగ్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ క్వాడర్ ఈ ప్రకటన చేశారు. పోలీసులు, భద్రతా అధికారులు శుక్రవారం నిరసనకారులపై కాల్పులు జరిపారు. రాజధానిలో అన్ని సమావేశాలను నిషేధించిన తర్వాత కూడా కొంతమంది ఆందోళనలకు ప్రయత్నించడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు మీడియా కథనాలు తెలిపాయి. పరిపాలనలో అవాంతరం తగ్గించడానికి మిలిటరిని మోహరించినట్లు క్వాడర్ చెప్పారు. బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న విదేశీ పర్యాటకలు త్రిపుర రాజధాని అగర్తలో గల ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అఖౌరా ద్వారా భారత దేశానికి రావడం ప్రారంభించారు. ఉద్యోగాలలో మెరుగైన రిజర్వేషన్ విధానం ఉండాలని రాజధాని లోని విశ్వవిద్యాలయంలో ఈ హింస ప్రారంభం అయింది. విద్యార్థి నాయకులు కొంతమంది నార్సింగి జిల్లాలోని జైలు పై దాడి చేసి అక్కడ ఉన్న ఖైదీలను విడుదల చేసి అనంతరం జైలుకు నిప్పుపెట్టారు. దేశం మొత్తం పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో రాజధాని ఢాకా, సహ ఇతర ప్రాంతాలలో మెట్రోపాలిటన్ పోలీసులు అన్ని ర్యాలీలు, ఊరేగింపులను నిషేధించారు. హసీనా అవామీ లీగ్ యువజన విభాగం అయిన బంగ్లాదేశ్ ఛత్ర లీగ్ ని మినహాయించి విద్యార్థి సంఘాల కూటమి అయిన స్టూడెంట్స్ ఎగైనెస్ట్ డిస్క్రిమినేషన్ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. గత నెలలో, బంగ్లాదేశ్ హైకోర్టు 1971 లిబరేషన్ వార్ కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించి రిజర్వేషన్లను పునరుద్దరించింది. దీంతో దేశ వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభమైంది. ఆ దేశ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించడంతో ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో 64 మంది చనిపోయారు.

Post a Comment

0 Comments

Close Menu