Ad Code

భారత్‌లో 'యాపిల్‌ వాచ్‌ ఫర్‌ కిడ్స్‌' లాంచ్‌ !


యాపిల్‌ వాచ్‌ ఫర్‌ యువర్ కిడ్స్‌ను  లాంచ్‌ చేసింది. పిల్లల వద్ద ఐఫోన్‌ లేకపోయినా యాపిల్‌ వాచ్‌ ద్వారా వారు కాల్స్‌, మెసేజ్ లు చేసేందుకు ఈ సదుపాయం వీలు కల్పిస్తుంది. పైగా పిల్లల యాక్టివిటీని తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టేందుకు ఉపయోపడుతుంది. యాపిల్‌ కిడ్స్‌ సదుపాయాన్ని యాక్టివేట్‌ చేసిన వాచ్‌లో పిల్లలు తమ కుటుంబ సభ్యులు/ స్నేహితులతో కనెక్ట్‌ అవ్వొచ్చు. యాపిల్‌ మ్యాప్స్‌, సిరి, హెల్త్ ఫీచర్లను వినియోగించుకోవచ్చు. అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్‌ను కూడా వాడుకోవచ్చు. అంతేకాదు తమ వాచ్‌ను ఉపయోగించి తల్లిదండ్రులకు తమ లొకేషన్‌ను కూడా షేర్‌ చేయొచ్చు. ఈ సదుపాయం ద్వారా పిల్లల వాచ్‌ల పూర్తి కంట్రోల్‌ తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది. ఏదైనా కొత్త యాప్‌ డౌన్‌లోడ్‌ చేయాలన్నా, కొత్త కాంటాక్టులు యాడ్‌ చేయాలన్న వారి అనుమతి తప్పనిసరి. వారి యాక్టివిటీని ఇందులో ట్రాక్‌ చేయొచ్చు. తమ ఐఫోన్‌ ద్వారా టాస్కులను, షెడ్యూళ్లను, రిమైండర్లను సెట్‌ చేయొచ్చు. స్కూల్‌ సమయంలో యాప్స్‌ను యాక్సెస్‌ చేయకుండా 'స్కూల్‌మోడ్‌'ను యాక్టివేట్‌ చేయొచ్చు. యాపిల్‌ వాచ్‌ ఫర్‌ యువర్‌ కిడ్స్‌ ఫీచర్‌ వినియోగించాలంటే యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 4, ఆపై మోడళ్లు అయ్యి ఉండాలి. యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ సిరీస్‌ కూడా ఈ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే, ఐఓఎస్‌ 14 లేదా ఆపై ఓఎస్‌లు కలిగిన ఐఫోన్‌ 6ఎస్‌ లేదా ఆపై మోడళ్లలో ఈ ఫీచర్‌ వినియోగించుకోవచ్చు. దీని కోసం సెల్యూలర్‌ ప్లాన్, యాపిల్‌ వాచ్‌ అవసరం ఉంటుంది. ఈ ఫీచర్‌ వినియోగిస్తే యాపిల్‌ వాచ్‌ సింగిల్‌ ఛార్జ్‌తో 14 గంటలు పని చేస్తుందని యాపిల్‌ పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu