Ad Code

యూట్యూబ్‌లో అంతరాయం ?


యూట్యూబ్‌లో సాంకేతిక సమస్య తలెత్తి యూట్యూబ్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో ఈ అంతరాయం ఏర్పడింది. వీడియోలు అప్‌లోడ్‌ కావడం లేదంటూ పలువురు యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ఈ సమస్య ప్రారంభమైంది. ఈ అంతరాయానికి గల కారణమేంటన్నది తెలియ రాలేదు. యూట్యూబ్‌ దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. కేవలం వీడియోల అప్‌లోడింగ్‌ విషయంలోనే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో చిన్నపాటి సాంకేతిక సమస్య అయి ఉంటుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. కాసేపట్లో సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Post a Comment

0 Comments

Close Menu