Ad Code

బడ్జెట్ ప్రసంగంలా లేదు - రాజకీయ ప్రసంగంలా ఉంది : కేసీఆర్


బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ బడ్జెట్ పై మాట్లాడుతూ వత్తి వత్తి చెప్పారు కానీ కొత్త విషయం ఏదీ తెలంగాణ బడ్జెట్ లో లేదని విమర్శించారు. కొత్త సంక్షేమ పథకం ఒక్కటి కూడా ఇందులో లేదన్నారు. ఉన్న పథకాలనే కొత్తగా చెబుతున్నారని, తెలంగాణ బడ్జెట్ పెద్ద గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. లక్షకోట్ల రుణాలు కూడా పాత పథకమేనని, వీరేదో కొత్తగా ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారన్నారు. కొత్త ప్రభుత్వానికి తాను ఆరు నెలలు గడువు ఇవ్వాలనుకున్నానని, అందుకే తాను అసెంబ్లీకి కూడా  రాలేదని గుర్తు చేశారు. తెలంగాణలో ఏ ఒక్క పాలసీని కూడా సరిగా రూపొందించలేదని, ఇది అర్భక ప్రభుత్వం అని కేసీఆర్ అన్నారు. తమ హయాంలో రెండు పంటలకు రైతు బంధు ఇచ్చామని, ఇప్పుడు అసలు పూర్తిగా రైతుబంధుని ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధు ద్వారా రైతులకు ఇచ్చిన సొమ్ముని తాము దుర్వినియోగంచేసినట్టు కాంగ్రెస్ చెబుతోందని, వారిది రైతు శత్రు ప్రభుత్వం అని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు లేదని, విద్యుత్ సరఫరా లేదని, రైతులను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని, వృత్తికార్మికులను వంచించిందని అన్నారాయన. తెలంగాణ ఐటీ పాలసీ ఏంటి ? పారిశ్రామిక పాలసీ ఏంటి ? వ్యవసాయ పాలసీ ఏంటి ? అనే వివరాలేవీ బడ్జెట్ లో లేవన్నారు. బడ్జెట్ అంతా గ్యాసు, ట్రాషు అని అన్నారు కేసీఆర్. వంచనను ఈస్ట్ మన్ కలర్ లో చూపించారన్నారు. ఇది పేదల బడ్జెట్ కాదని విమర్శించారు. భవిష్యత్ లో ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామని హెచ్చరించారు. అది బడ్జెట్ ప్రసంగంలా లేదని, ప్లాట్ ఫామ్ స్పీచ్ లా ఉందన్నారు. రాజకీయ ప్రసంగం ఇచ్చారే కానీ, బడ్జెట్ పై మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. 

బడ్జెట్ ఆత్మస్తుతి పరనిందలా ఉంది  : హారీష్ రావు

తెలంగాణ బడ్జెట్ ఆత్మస్తుతి పరనిందలా ఉందని.. బడ్జెట్ రాష్ట్ర అన్ని వర్గాలను తీవ్ర నిరాశ పర్చిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ.. బడ్జెట్లో అంకెల గారడీ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్డెట్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల ప్రస్తావన లేదని.. ఇది రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకెళ్లే బడ్జెట్ అని అభివర్ణించారు. మేనిఫెస్టోను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉండాలి కానీ దురదృష్టవశాత్తూ అలా లేదని అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu