Ad Code

స్వల్ప నష్టాల్లో ముగిసిన సూచీలు !


దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. మంగళవారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. సూచీలు రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా మార్కెట్ అంచనాలు అందుకోని కారణంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ విషయంలో ఏమైనా మార్పులు చేస్తారా అనే దానిపై దేశీ, విదేశీ మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెన్సెక్స్‌ ఉదయం 80,408.90 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,604.65) నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొంది. ఇంట్రాడేలో 80100.65- 80800.92 పాయింట్ల మధ్య కదలాడిన సూచీ చివరికి 102 పాయింట్ల నష్టంతో 80,502 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 21.65 పాయింట్ల నష్టంతో 24,509.25 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.67గా ఉంది. సెన్సెక్స్‌లో ఎన్టీపీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు లాభపడగా.. కోటక్ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ షేర్లు నష్టపోయాయి. 

Post a Comment

0 Comments

Close Menu