Ad Code

గుజరాత్‌లోఇండియా కూటమి విజయం సాధిస్తుంది : రాహుల్‌ గాంధీ !


గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో రాహుల్‌ మాట్లాడుతూ కలిసికట్టుగా పోరాడి అయోధ్యలో భాజపాను ఓడించినట్లే గుజరాత్‌లోనూ నరేంద్రమోదీని, ఆ పార్టీని ఓడిస్తాం. విమానాశ్రయ నిర్మాణం పేరుతో అయోధ్యలోని సామాన్యుల భూములను కొల్లగొట్టారు. ఎంతో మంది తమ విలువైన స్థలాలు కోల్పోయారు. రామమందిర ప్రారంభోత్సవానికి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులను, ధనవంతులను ఆహ్వానించిన కేంద్రం.. స్థానికులను మాత్రం పిలవలేదు'' అని విమర్శించారు. ఇటీవల రాజ్‌కోట్‌లోని గేమ్‌జోన్‌లో అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాహుల్‌ పరామర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన అగ్నివీర్ పథకంపై తీవ్ర పార్లమెంట్‌ వేదికగా తీవ్ర అభ్యంతరం తెలిపిన రాహుల్‌ గాంధీ.. తాజాగా 'ఎక్స్‌' లో విమర్శలు గుప్పించారు. విధి నిర్వహణలో ఇటీవల ప్రాణాలు కోల్పోయిన అగ్నివీరుడు అజయ్‌కుమార్‌ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఎలాంటి పరిహారం లభించలేదని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను పోస్టు చేశారు. ఆర్మీ గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ ఫండ్‌ నుంచి రూ.48 లక్షలు, ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి మరో రూ.50 లక్షలు వచ్చినట్లు అగ్నివీరుడి తండ్రి చెప్పారని.. అయితే అతడికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎక్స్‌గ్రేషియా సంగతి ఏంటని రాహుల్‌ ప్రశ్నించారు. జీతం బకాయిలు ఎందుకు అతడి ఖాతాలో జమ చేయలేదని నిలదీశారు. ప్రభుత్వం కేవలం ఇన్సూరెన్స్‌ మాత్రమే చెల్లించింది. ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదు. ఈ రెండింటికీ తేడా ఉంది. అగ్నివీరుడి కుటుంబానికి ఇన్సూరెన్స్‌ కంపెనీలే చెల్లించాయి తప్ప, ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదని రాహుల్‌ అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలను కేంద్రం గౌరవించి తీరాలని, కానీ ప్రధాని మోడీ మాత్రం వారిపై వివక్ష చూపుతున్నారని రాహుల్‌ విమర్శించారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమన్న ఆయన.. కేంద్రం ఏమనుకున్నా సరే.. ఈ అంశాన్ని పదేపదే లేవనెత్తుతూనే ఉంటానని తెలిపారు. రక్షణ బలగాలను ఇండియా కూటమి ఎప్పటికీ బలహీన పరచబోదని స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu