Ad Code

పేటీఎంకు సెబీ హెచ్చరికలు ?


ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎంకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నుంచి హెచ్చరికలు అందాయి. 2021-22లో పేటీఎం పేమెంట్స్‌తో జరిపిన రెండు లావాదేవీలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించింది. కంపెనీ ఆడిట్‌ కమిటీ, షేర్‌హోల్డర్ల నుంచి అనుమతి లేకుండానే వాటిని నిర్వహించినట్లు పేర్కొంది. సెబీ నుంచి తమకు సోమవారం లేఖ అందినట్లు ఎక్చ్సేంజ్‌ ఫైలింగ్‌లో పేటీఎం వెల్లడించింది. సెబీ పేర్కొన్న రెండు లావాదేవీల మొత్తం రూ.324 కోట్లు, రూ.36 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సెబీ  స్పష్టం చేసింది. దీనిపై వీలైనంత త్వరగా స్పందించాలని పేటీఎంను ఆదేశించింది. దిద్దుబాటు కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని పేర్కొంది. సెబీ హెచ్చరికలపై పేటీఎం స్పందించింది. తాము నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొంది. అలాగే సెబీ నోటీసుల వల్ల తమ కార్యకలాపాలు, ఆర్థిక వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలిపింది. సెబీ ఇప్పటికే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో కంపెనీ షేరు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతోంది. రెండు శాతానికి పైగా నష్టపోయి రూ.458 వద్ద ట్రేడవుతోంది.

Post a Comment

0 Comments

Close Menu