Ad Code

గాజు తీగ - ఆరోగ్య ప్రయోజనాలు !


గాజు తీగ. దీన్ని బుట్ట బుడస, బంగారు తీగ, బుబటి తీగ మొక్క, తెల్ల జుంకీ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ తీగకు కాయలు కూడా కాస్తాయి. ఈ తీగ ఆకులే కాకుండా కాయల్లో కూడా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నవారు ఈ చెట్టు ఆకులను ఎండబెట్టి కషాయం చేసుకుని తాగినే చాలా రిలీఫ్ ఉంటుందని చెబుతున్నారు. అలానే దగ్గు, కఫం, ఊపిరితిత్తుల్లో వచ్చే నిమ్ము, జలుబు సమస్యలు నుంచి స్వాంతన చేకూరుస్తుందట !. ఆకులు శుభ్రంగా కడిగిన తర్వాత కొన్ని మిరియాలు వేసి… పేస్ట్‌లా చేసి తలకు రాసుకుంటే.. తలనొప్పి తగ్గుతందట. ఇక ఈ తీగ వేర్లను పలు రకాల ఔషధాల తయరీలో వినియోగిస్తారట. ఈ మొక్క ఆకులకు యాంటీబయోటిక్ లక్షణాలు ఉన్నాయి. గజ్జి, తామర, దురద వంటి చర్మ సంబంధిత వ్యాధులు అనేక ఇన్ఫెక్షన్స్, వ్యాధుల బారిన పడకుండా ఈ ఆకు కాపాడుతుంది.

Post a Comment

0 Comments

Close Menu