Ad Code

వాయుగుండంగా అల్పపీడనం !


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాగల 24 గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు కోస్తాలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, అల్లూరి జిల్లాల్లో మూడు రోజుల పాటు అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించించారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఓడరేవుకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu