Ad Code

సికింద్రాబాద్‌ నుంచి గోవాకు వారానికి రెండు రైళ్లు !


సికింద్రాబాద్‌ నుంచి వాస్కోడగామా(గోవా)కు వెళ్లేందుకు వారానికి రెండుసార్లు కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనుంది. సికింద్రాబాద్‌ నుంచి బుధ, శుక్రవారం కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ( 17039 / 17040 ) నడువనున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి  ఎక్స్‌లో పోస్టు చేశారు. వాస్కోడగామా నుంచి గురు, శనివారం తిరిగి బయలుదేరుతాయని వెల్లడించారు. ఈ రైళ్లు సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ వాస్కోడగామా చేరుకుంటుందని ఆయన వివరించారు. గతంలో వారానికి ఒక రైలు 10 కోచ్‌లతో బయలుదేరి గుంతకల్‌కు చేరుకుని అక్కడి నుంచి తిరుపతి నుంచి మరో 10 కోచ్‌లతో గోవాకు వెళ్లేదని తెలిపారు. ఇదేకాకుండా కాచిగూడ- యలహంక మధ్యన వారానికి నాలుగురోజులు ప్రయాణం చేసే రైలుకు గోవాకువెళ్లే 4 కోచ్‌లను కలిపేవారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో అవసరమైన ఈ రైలును ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu