Ad Code

దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు !


దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో అన్ని రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. వంకలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. బీహార్, హిమాలయ, పశ్చిమబెంగాల్, సిక్కిం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన భారత వాతావరణ శాఖ ఆయా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, చంఢీగఢ్ , ఢిల్లీలలో, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాలు సహా.. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు తెలంగాణలో అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అస్సాంలో 27 జిల్లాలపై వరద ప్రభావం ఉంది. ఎడతెరపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. నదులు ప్రమాదకర స్థాయిని ప్రవహించడం, కొండ చరియలు విరిగిపడటంతో.. జాతీయ రహదారులపై రాకపోకలను నిలిపివేశారు అధికారులు. బీహార్ లో కోసి సహా.. నదుల నీటిమట్టం పెరగడంతో ఏడు జిల్లాలు జలదిగ్భంధమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మరో ఐదు రోజులపాటు భారీ వర్షసూచన ఉండటంతో.. ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అస్సాంలో వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 109కి చేరుకుంది. 12 లక్షల మందిని సురక్షితప్రాంతాలకు చేర్చారు. 400 గ్రామాల ప్రజలు నిత్యావసరాల కూడా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


Post a Comment

0 Comments

Close Menu