Ad Code

పెరుగులో అటుకులు కలుపుకుని తింటే కీళ్ల నొప్పులు మటు మాయం !


కీళ్ల మధ్య గుజ్జు అరిగిపోవటం వలన కీళ్ల నొప్పులు వస్తూ వస్తుంటాయి. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మోకాళ్ల నొప్పులు వచ్చినప్పుడు విపరీతమైన బాధ ఉంటుంది. ఆ బాధ భరించలేక చాలా మంది టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అవి తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయి. ఓ చక్కటి చిట్కా నొప్పుల నివారణకు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఒక బౌల్ లో రెండు స్పూన్ల అటుకులు, నాలుగు స్పూన్ల పెరుగు వేసి బాగా కలిపి అరగంట అలా వదిలేస్తే పెరుగులో అటుకులు నాని మెత్తగా అవుతాయి. పెరుగులో నానిన అటుకులను ప్రతి రోజు తినాలి. వీటిని ఏ సమయంలోనైనా తినవచ్చు. పెరుగు, అటుకులు రెండింటిలోనూ కాల్షియం ఉండటం వలన చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అటుకుల్లో పెరుగు కలిపి తినటం కష్టంగా ఉంటే కొంచెం తాలింపు పెట్టుకొని తినవచ్చు. ప్రతి రోజు అటుకులు, పెరుగు కలిపి తింటే మీకు ఆ తేడా వారం రోజుల్లోనే కనపడుతుంది. పెరుగులో అటుకులు కలిపి దద్దోజనం లాగా తీసుకోవడం వల్ల కాల్షియం బాగా శరీరానికి అందేలా చేస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఇది అమృతం లాంటిది.

Post a Comment

0 Comments

Close Menu